Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడాలి నానిపై చర్యలకు హైకోర్టు బ్రేక్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 01, 2026 6:21 AM అమరావతిGeneral
కొడాలి నానిపై చర్యలకు హైకోర్టు బ్రేక్ - Udayam
గతంలో ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో, కలెక్టర్ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు నిలిపివేసింది. తదుపరి ఆదేశాల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...