వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలు కల్పనను పుణేలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిచ్చిన సమాచారంతో కల్పన ఆచూకీని కనిపెట్టారు. దొంగతనం ఉద్దేశంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Comments
Loading comments...

