Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ అరెస్ట్‌

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 4:14 PM హన్మకొండ General
మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ అరెస్ట్‌ - Udayam
హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ కార్యాలయం నుంచి వినయ్‌ భాస్కర్‌ను పోలీసులు తరలించడంతో హనుమకొండ పరిసరాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. అరెస్ట్‌కు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.

Comments

G
Loading comments...