Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు 350 మంది భక్తుల పాదయాత్ర

భవ్య శ్రీ Jul 24, 2026 1:08 PM కడపabout 1 hour ago
తిరుమలకు 350 మంది భక్తుల పాదయాత్ర - Udayam Digital
కమలాపురం మండలం పెద్దచెప్పలి గ్రామం నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం సుమారు 350 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణచైతన్యరెడ్డి పెద్దచెప్పలి ఎల్లమ్మ దేవాలయం వద్ద ఈ యాత్రను ప్రారంభించారు. అంతకుముందు ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర సజావుగా సాగాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...