Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కశ్మీర్‌ను ముంచెత్తిన వరదలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 06, 2026 12:31 PM జాతీయంGeneral
జమ్మూ కశ్మీర్‌ను ముంచెత్తిన వరదలు - Udayam
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు హఠాత్తుగా వరదలు పోటెత్తాయి. కిష్త్వార్‌లోని క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో భారీ కొండచరియ విరిగిపడటంతో పలు వాహనాలు ధ్వంసమవగా, సహాయక సిబ్బంది రంగంలోకి దిగి శిథిలాలను తొలగిస్తున్నారు. మరోవైపు, ప్రేమ్ నగర్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో దోడా-కిష్త్వార్ రహదారిని అధికారులు పూర్తిగా మూసివేశారు. రవాణా నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, వాతావరణం మెరుగుపడే వరకు అనవసర ప్రయాణాలు చేయవద్దని పరిపాలనా యంత్రాంగం హెచ్చరించింది.

Comments

G
Loading comments...