వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరద తగ్గడంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ముంపు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గృహాల్లో చేరిన బురదను తొలగించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
విద్యుత్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు రెండు రోజులుగా గ్రామాల్లోనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. రోగాలు ప్రబలకుండా వీధులు, ఇళ్లను శుభ్రం చేస్తున్నారు.
Comments
Loading comments...

