వార్తలకు తిరిగి వెళ్లండి
ఐదుగురు సీనియర్లకు ఐఏఎస్ హోదా

రాష్ట్రంలో నాన్-స్టేట్ సివిల్ సర్వీసెస్ కోటా కింద ఐదుగురు సీనియర్ అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. గోపినాథ్, బాలకృష్ణ, జయకృష్ణ, పద్మావతి, వరప్రసాద్‌లకు ఈ పదోన్నతి దక్కినట్లు కేంద్ర నోటిఫికేషన్ ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
గత రెండేళ్లలో ఖాళీగా ఉన్న ఆరు ఐఏఎస్ పోస్టులకు గాను ఈ ఐదు పోస్టులను భర్తీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...