Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తొలి ఏకాదశి, కిటకిటలాడిన ఆలయాలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 25, 2026 10:55 AM హైదరాబాద్General
తొలి ఏకాదశి, కిటకిటలాడిన ఆలయాలు - Udayam
తొలి ఏకాదశిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి చందానగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.

Comments

G
Loading comments...