Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 12, 2026 3:22 PM ఆల్ ఇండియా జాతీయ
ముంబైలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి - Udayam
ముంబై విలేపార్లేలో 12 అంతస్తుల భవనంలోని 11వ అంతస్తులో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా, మహిళ, చిన్నారి మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగా ఉంది. రాత్రి 10 గంటలకు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అర్ధరాత్రి 12.25 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...