వార్తలకు తిరిగి వెళ్లండి

కందులాపురం కూడలిలో శనివారం అర్ధరాత్రి ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో సిమెంటు లోడుతో వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. టైర్లు పేలడంతో పక్కనే ఉన్న విద్యుత్తు పరివర్తకాన్ని తాకి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కిందకు దూకడంతో ప్రమాదం తప్పింది.
పక్కనే ఉన్న ఇళ్ల ముందు నిలిపిన రెండు బైకులు దగ్ధమయ్యాయి. పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేయగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Comments
Loading comments...

