Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజీబీఎస్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Ravi Shukla May 26, 2026 12:30 PM హైదరాబాద్General
ఎంజీబీఎస్‌లో అగ్నిప్రమాదం - Udayam
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ (MGBS) బస్టాండ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించి నీళ్లతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు, దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...