వార్తలకు తిరిగి వెళ్లండి
కన్నకొడుకును చంపిన తండ్రి

నంద్యాల జిల్లా కంపమల్లలో మానసిక స్థితి సరిగ్గా లేని కుమారుడు వంశీకృష్ణ(22) నిత్యం వేధిస్తున్నాడనే భయంతో కన్నతండ్రి వసుంధరరావు కట్టెతో కొట్టి చంపాడు. బుధవారం రాత్రి తల్లిని కొట్టి వస్తువులు పగలగొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
తమను చంపుతాడేమోననే ఆందోళనతో తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...