Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం చెప్పులతో క్యూలో నిలిచిన రైతులు

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 7:19 PM మెదక్General
యూరియా కోసం చెప్పులతో క్యూలో నిలిచిన రైతులు - Udayam
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌లో బుక్‌ చేసుకుని 24 గంటలు దాటినా యూరియా పంపిణీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి యూరియా అందకపోవడంతో రైతులు కేంద్రం వద్ద చెప్పులను వరుసలో పెట్టి బారులు తీరారు. యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసినా యూరియా కోసం వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...