Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి విడుదలకు రైతుల ధర్నా

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 06, 2026 12:11 PM జనగామ General
సాగునీటి విడుదలకు రైతుల ధర్నా - Udayam
స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు గేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లలో నీరు తగ్గిపోవడంతో సాగు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...