వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలు పొందేందుకు రైతులు అగ్రిస్టాక్ రైతు నమోదు చేసుకోవాలని చివ్వెంల ఏవో డి.వెంకటేశ్వర్లు తెలిపారు. జయరాంగుడి తండా, ఐలాపురంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు ప్రత్యేక నమోదు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆధార్, భూమి పాస్‌బుక్, మొబైల్ నంబర్‌తో ఏఈఓ, మీ-సేవ, సీఎస్‌సీల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

