Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాట వివాదంతో రైతు మృతి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 07, 2026 3:07 PM సిద్దిపేటGeneral
బాట వివాదంతో రైతు మృతి - Udayam
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లో బాట వివాదం విషాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన పుల్లెం కుమారస్వామి(60) పొలానికి వెళ్లే దారి విషయంలో మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. గురువారం ఆయన ఉరివేసుకుని మృతి చెందినట్లు చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...