Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లికి దూరంగా చావుకు దగ్గరగా

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:00 AM అనంతపురంGeneral
పెళ్లికి దూరంగా చావుకు దగ్గరగా - Udayam
అనంతపురం జిల్లా యాడికిలోని రఘునాథ్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె సంయుక్త ఇటీవల నిశ్చితార్థం చేసుకోగా, నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే టైఫాయిడ్‌తో బాధపడుతున్న ఆమెకు ఆదివారం ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందింది. ఏడాది కిందట సంయుక్త సోదరి నందిని కూడా మృతి చెందింది. ఇద్దరు కుమార్తెలను కోల్పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...