Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కుటుంబం ఆందోళన

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 06, 2026 4:55 PM వరంగల్General
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కుటుంబం ఆందోళన - Udayam
వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఓ కుటుంబం పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నాయకుడు బొంత సారంగపాణి తమ భూమిని కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని పేర్కొంటూ ఆందోళనకు దిగినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...