Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ విగ్రహం, రాయితో మోసం

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 6:14 PM హైదరాబాద్General
నకిలీ విగ్రహం, రాయితో మోసం - Udayam
హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సంయుక్తంగా నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరుతో మోసం చేసేందుకు యత్నించిన ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. కాటేదాన్‌ లక్ష్మిగూడలో విక్రయానికి సిద్ధంగా ఉండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి నకిలీ విగ్రహం, గులాబీ రంగు రాయి, ఎర్టిగా వాహనం, 5 మొబైల్‌ ఫోన్లు, 3 రసాయన ద్రావణాల బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...