Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూలైన్లలో ఎక్స్-లిఫ్టర్

మానస శర్మ Jul 15, 2026 10:21 AM తిరుపతి 2 viewsabout 3 hours ago
తిరుమల క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం టీటీడీ నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులకు అన్నప్రసాదం, నీరు, పాలు వేగంగా అందించేందుకు ఎక్స్-లిఫ్టర్ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ కొత్త వ్యవస్థకు సంబంధించి అధికారులు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో సఫలమైతే క్యూలైన్లలో భక్తుల సౌకర్యార్థం దీనిని శాశ్వతంగా అమలుచేయనున్నారు.

Comments

G
Loading comments...