Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ బాలుర వసతి గృహం తనిఖీ

Follow Udayam on Google
Muthyam silari Aug 25, 2026 5:55 PM నిర్మల్General
ఎస్సీ బాలుర వసతి గృహం తనిఖీ - Udayam
దిలవర్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎంపీఓ గోవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయన హాస్టల్‌లోని స్టాక్ రిజిస్టర్‌ను, వంటగదిని క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించి, భోజనం వేళకు సరిగ్గా అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ మురళి, ఈవో మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...