Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీలో 46 టీఎంసీలకు చేరిన నిల్వ

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 9:22 AM నిజామాబాద్General
ఎస్సారెస్పీలో 46 టీఎంసీలకు చేరిన నిల్వ - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.40 అడుగులు, నిల్వ 46.057 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో 2,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,558 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 37.701 టీఎంసీల వచ్చినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...