Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.ఐ.ఆర్. ప్రక్రియను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ భార్గవి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 6:46 PM విశాఖపట్నంGeneral
ఎస్.ఐ.ఆర్. ప్రక్రియను పరిశీలించిన రోల్ అబ్జర్వర్ భార్గవి - Udayam
విశాఖ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం నియమించిన రోల్ అబ్జర్వర్ ఎస్. భార్గవి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె వివిధ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. సంబంధిత రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...