Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవం

Follow Udayam on Google
p.g.murthy Sep 09, 2026 1:02 PM మంచిర్యాలGeneral
ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవం - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం కార్యాలయంలో ఎంపీడీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు కాలోజీ నారాయణరావు ప్రతీకగా ఉన్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...