Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎంఎంఎస్‌ రిజిస్ట్రేషన్‌కు నేడు చివరి తేదీ

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 31, 2026 3:05 PM సంగారెడ్డిGeneral
ఎన్‌ఎంఎంఎస్‌ రిజిస్ట్రేషన్‌కు నేడు చివరి తేదీ - Udayam
సంగారెడ్డి జిల్లాలోని ఎంఈఆర్‌వోలు, ప్రధానోపాధ్యాయులు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి ఆదేశించారు. ఎన్‌ఎంఎంఎస్‌ తాజా, పునరుద్ధరణ విద్యార్థుల నమోదుకు సోమవారం చివరి తేదీ అని తెలిపారు. గత ఏడాది 1,363 మంది నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1,160 మంది మాత్రమే నమోదు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గడువులోగా అర్హులైన విద్యార్థులందరూ నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...