వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలంలో మూడు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండటంతో పత్తి మొక్కలు వాడిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాచిపెంట, కర్రివలస, గైరమ్మపేట తదితర గ్రామాల్లో సుమారు 3,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.
ఎకరాకు సుమారు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

