వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ నమోదుకు జూలై 31తో గడువు ముగియనుంది. జిల్లాలోని 16.45 లక్షల మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 12.71 లక్షల మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు.
ఇంకా 3.74 లక్షల మందికి పైగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. గడువులోగా ఈ-కేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్ జాబితా నుంచి తొలగించి బియ్యం సరఫరా నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

