Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు రేపు జాబ్‌ మేళా

Follow Udayam on Google
Anuroop Aug 17, 2026 3:53 PM నిజామాబాద్General
నిరుద్యోగ యువతకు రేపు జాబ్‌ మేళా - Udayam
నిజామాబాద్ లోని ప్రైవేటు రంగంలో పని చేసేందుకు నిరుద్యోగ యువతకు రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి వేల్పుల విజేత తెలిపారు. వరుణ్ మోటార్స్, అపోలో, ప్రూడెన్షియల్ ఆసుపత్రిలో ఉద్యోగాలకు అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు శివాజీ నగర్‌ ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో మేళా నిర్వహించనున్నారు. అభ్యర్థులు సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...