వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు డోన్ ఆర్టీసీ డిపో ఉద్యోగులు మంగళవారం తెల్లవారుజామున నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. డిపో సెక్రటరీ ఐవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పీఆర్సీ, డీఏ, ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లను చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. యూనియన్ సభ్యులు కామేశ్, కోటేశ్వరరావు, రమణరెడ్డి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

