Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేల అరెస్ట్‌కు నిరసనగా కరీంనగర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో

Follow Udayam on Google
sudheer Sep 07, 2026 4:33 PM కరీంనగర్General
అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ కరీంనగర్ బస్టాండ్ ఎదుట గులాబీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని నాయకులు మండిపడ్డారు.

Comments

G
Loading comments...