Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే రాక ఆలస్యం.. సమావేశం నుంచి సర్పంచుల వాకౌట్

Follow Udayam on Google
Sandeep Sep 24, 2026 2:25 PM నిర్మల్General
ఎమ్మెల్యే రాక ఆలస్యం.. సమావేశం నుంచి సర్పంచుల వాకౌట్ - Udayam
సోన్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించాల్సిన మండల సర్వసభ్య సమావేశాన్ని పలువురు కాంగ్రెస్ సర్పంచులు బహిష్కరించారు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆలస్యంగా రావడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్ధిలకుంట గంజాల్, కడ్తాల్ గ్రామాల సర్పంచులు వాకౌట్ చేశారు.

Comments

G
Loading comments...