Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెలికాప్టర్‌తో గణేశుడిపై పూలవర్షం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 3:01 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని బౌరంపేటలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గణనాథుడిపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించి ప్రత్యేకంగా వీడ్కోలు పలికారు. పూలరేకులు కురుస్తుండగా భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో సందడి చేశారు. సంగీతం, భక్తుల కోలాహలం మధ్య నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

Comments

G
Loading comments...