వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలోని అసంపూర్తి క్రీడా మైదానం అభివృద్ధికి సీఎస్‌ఐఆర్ ఫండ్ నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం ఆయన మైదానాన్ని సందర్శించారు.
క్రీడా మైదానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచి నిరంజన్, మాజీ సర్పంచ్‌లు, అల్యూమిని కమిటీ సభ్యులు, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

