వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని ఎల్లోరా కైలాస దేవాలయంలో రావణుడి శివభక్తిని ప్రతిబింబించే అరుదైన శిల్పం ఉంది. ఎనిమిదో శతాబ్దంలో రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడి కాలంలో చెక్కిన ఈ శిల్పం ప్రత్యేకతను సంతరించుకుంది.
శివలింగం చుట్టూ తొమ్మిది శిరస్సులను చెక్కారు. పౌరాణిక కథనం ప్రకారం రావణుడు వాటిని శివుడికి సమర్పించినట్లు శిల్పం సూచిస్తుంది. కింది భాగంలో పదో తలను సమర్పించేందుకు ఖడ్గంతో సిద్ధమైన రావణుడిని చిత్రించారు.
Comments
Loading comments...

