వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బేద్రె పోలీస్‌స్టేషన్ పరిధిలో మావోయిస్టులు దాచిన డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
లంక పహాడీ అడవుల్లో డిమైనింగ్ సందర్భంగా SLR, INSAS రైఫిళ్లు, .315 బోర్ తుపాకీ, BGL లాంచర్లు, గ్రెనేడ్లు, తూటాలు, మ్యాగజైన్లు తదితరాలు లభించాయి. ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

