వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. యూసఫ్‌గూడ, పంజాగుట్ట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్‌లో రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై ట్రాఫిక్ స్తంభించడంతో జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు నగరవాసులకు సూచించారు.
Comments
Loading comments...

