Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎన్.పేట: నాలుగు రోజులుగా తగ్గని వరద నీరు

Follow Udayam on Google
Hari Sep 26, 2026 6:36 PM శ్రీకాకుళంGeneral
ఎల్.ఎన్.పేట: నాలుగు రోజులుగా తగ్గని వరద నీరు - Udayam
ఎల్.ఎన్.పేట మండలంలోని తంపర పొలాల్లో చేరిన వరద నీరు నాలుగు రోజులుగా తగ్గడం లేదు. తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సుమారు 500 ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. తురకపేట, దబ్బపాడు, వాడవలస, మిరియాపల్లి, చిట్టిమండలం, కోవిలాం, ధనుకువాడ, రావిచంద్రి తదితర గ్రామాల్లో పొలాల్లో వరద నీరు నిలిచిపోయిందని రైతులు తెలిపారు. పంటలు దెబ్బతినడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...