Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో వరుస దొంగతనాలు

Follow Udayam on Google
madhu Sep 08, 2026 9:57 AM ములుగుGeneral
ఏటూరునాగారంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 2న ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న మహేశ్వరి అనే మహిళ దుకాణంలో దొంగలు పడి నగదు, వస్తువులను అపహరించారు. వారం రోజులు గడవక ముందే సోమవారం రాత్రి అదే షాపును మరోసారి లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, వరుస దొంగతనాలను అరికట్టి నిందితులను పట్టుకోవాలన్నారు.

Comments

G
Loading comments...