Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Follow Udayam on Google
p.g.murthy Aug 21, 2026 3:04 PM మంచిర్యాలGeneral
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి - Udayam
జన్నారం మండలంలోని లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీకి చిక్కారు. గ్రామంలో ఒక ఇంటి పర్మిషన్ కు కార్యదర్శి వరలక్ష్మి డబ్బులు డిమాండ్ చేసినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో ఆమె డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని వారు తెలిపారు. దీనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. జన్నారం మండలంలో ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Comments

G
Loading comments...