వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం గుణానపురం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం ఉదయం తెలిపారు.
ఈ మేరకు గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటల సాగు సమయం కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ఏనుగుల గుంపును వెంటనే ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్తానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

