వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు గూడ్స్ హ్యాండ్ వర్క్‌షాప్ సమీపంలో ఆదివారం రాత్రి 40–45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి ఎత్తు సుమారు 5.5 అడుగులు, నల్లటి జుట్టు ఉన్నట్లు రైల్వే ఎస్‌ఐ దానం తెలిపారు.
బహిర్భూమికి వెళ్లిన సమయంలో రైలు ఢీకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్టేషన్ మాస్టర్ సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

