వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కిరెడ్డిపల్లి మెయిన్ రోడ్డు నుంచి ఏకిలపల్లి వరకు రూ.50 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. రాయచోటి టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణంతో ఏకిలపల్లి గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
Comments
Loading comments...

