వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ కృత్రిమ మేధ (ఏఐ) బోధనకు శ్రీకారం చుట్టింది. గతేడాది ప్రయోగాత్మకంగా 18 బడుల్లో అమలు చేయగా, సత్ఫలితాలు రావడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో దీన్ని 42 ప్రాథమిక పాఠశాలలకు విస్తరించారు.
విద్యార్థులు ఆటపాటలతో సులభంగా నేర్చుకునేలా ఆంగ్లం, గణితం, తెలుగు విషయాల్లో ఏఐ టూల్స్ ద్వారా బోధిస్తున్నారు. హెడ్‌సెట్లు, కంప్యూటర్ల సాయంతో పిల్లల ఉచ్చారణను సరిదిద్దడంతో పాటు, వారి పురోగతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మెరుగైన విద్యనందిస్తున్నారు.
Comments
Loading comments...

