Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్‌సెట్, పీఈసెట్ షెడ్యూల్ ఖరారు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 14, 2026 10:43 AM హైదరాబాద్General
ఎడ్‌సెట్, పీఈసెట్ షెడ్యూల్ ఖరారు - Udayam
రాష్ట్రంలో బీఈడీ, పీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్‌సెట్, పీఈసెట్ - 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన అధికారిక ముఖ్య ప్రకటన ఈనెల 14వ తేదీన వెలువడనుంది. అభ్యర్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్ ప్రక్రియ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఎడ్‌సెట్‌కు ఈనెల 28 వరకు, పీఈసెట్‌కు 25 వరకు నమోదుకు అవకాశముండగా, ఆగస్టులో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది.

Comments

G
Loading comments...