వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండలం బామిని గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం, బస్సు సర్వీస్ లేకపోవడంతో విద్యార్థులు ఎడ్లబండిపై బడిబాట పడుతున్నారు.
దారులు అధ్వానంగా ఉండటంతో చిన్నారులు నిత్యం కిలోమీటర్ల బురద దారుల్లో ప్రయాణం చేస్తూ పాఠశాలలకు వెళ్తున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ రవాణా సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే రోడ్డు వేయించి, బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

