వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూర్ మండలం ఎబ్బనూర్ గేట్ సమీపంలోని బోర్ పంపు కొంతకాలంగా పనిచేయడం లేదు. దీంతో తాగునీటి కోసం స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో సమస్య మరింత తీవ్రం కానుందని స్థానికులు చెబుతున్నారు.
బోర్ పంపును మరమ్మతు చేయాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. వెంటనే స్పందించి బోర్ పంపును వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

