వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ పంచాయతీ బంజరు దొడ్డిలో పుట్టిన చిన్న దూడను అధికారులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆవు దూడకు జన్మనిచ్చిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో పశువైద్య సిబ్బంది చికిత్స చేస్తున్నారు. దీంతో దూడకు ఆవు పాలు ఇవ్వలేకపోతోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ సిబ్బంది అప్పుడే పుట్టిన దూడకు డబ్బాల సహాయంతో పాలు తాగిస్తున్నారు. దూడను కాపాడుతున్న అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

