Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకదుర్గమ్మకు రూ.75 లక్షల కిరీటం కానుక

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 4:53 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు నవరాత్రి ఉత్సవాల్లో రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం కానుకగా అందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.దుర్గా శ్రీనివాస్‌ 494 గ్రాముల బంగారంతో దీన్ని రూపొందించారు. ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో రూపొందించిన నవరత్న కిరీటాన్ని గురువారం ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం కల్పించి, శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.

Comments

G
Loading comments...