Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల యార్డులో తగ్గుముఖం పట్టిన పసుపు ధరలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 2:58 PM గుంటూరుGeneral
దుగ్గిరాల యార్డులో తగ్గుముఖం పట్టిన పసుపు ధరలు - Udayam
దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన వేలంలో క్వింటాల్ పసుపు గరిష్టంగా రూ. 15,000 ధర పలికింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పసుపు కొమ్ముల రకం క్వింటాల్‌కు రూ. 11,000 నుంచి రూ. 15,000 వరకు విక్రయమవ్వగా, కాయ రకం పసుపు రూ. 11,000 నుంచి రూ. 14,800 వరకు ధర లభించింది. క్రితం వారంతో పోలిస్తే పసుపు ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...