Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులకు ఫిట్‌నెస్‌పై డీఎస్పీ సూచనలు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:02 AM మెదక్General
పోలీసులకు ఫిట్‌నెస్‌పై డీఎస్పీ సూచనలు - Udayam
మెదక్ జిల్లా పోలీస్‌ కార్యాలయ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన పోలీసు పరేడ్‌కు డీఎస్పీ ప్రసన్న కుమార్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమన్వయం, సమయపాలన కీలకమని తెలిపారు. సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంతో ఉండాలని, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా మెలిగి, వారి సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని తెలిపారు.

Comments

G
Loading comments...